Annamalai Comments: తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
చెన్నైలో నిర్వహించిన ‘ఇండియా టుడే రౌండ్‌టేబుల్’ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన కొందరు నాయకులు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించడం, మహిళలను అనవసరంగా వివాదాల్లోకి లాగడం వంటి పాత తరహా వైఖరినే ఇంకా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ, రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.
Read Also: Free Gold : ఆధార్ ఉంటే ఫ్రీగా తులం బంగారం నిజామా ?
Annamalai criticizes Tamil Nadu opposition parties.
Annamalai Comments: టీవీకే ప్రభుత్వం, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు
తమిళనాడులో రాజకీయ వాతావరణం గణనీయంగా మారిందన్న వాస్తవాన్ని ప్రత్యర్థులు గ్రహించడం లేదని అన్నామలై అన్నారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఆయన సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వంలో స్పష్టమైన దార్శనికత (విజన్) లోపించిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, రాష్ట్రంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారిపై ‘బీజేపీ బీ-టీమ్’ అంటూ ముద్ర వేసే అలవాటుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Epaper: epaper.vaartha.com
'దిమాగీ నక్సల్' వ్యాఖ్యల వివాదం..సోషల్ మీడియాలో కొత్త అకౌంట్

