Romi Bhinder Mobile Controversy: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఒక అనూహ్య ఘటన వెలుగు చూసింది.
రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఐపీఎల్ అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో ఉన్న ఏ సభ్యుడైనా కమ్యూనికేషన్ పరికరాలను వాడటం నిషేధం.
Read Also:T20 World Cup Fixing: డాక్యుమెంటరీతో బయటపడ్డ వరల్డ్ కప్ ఫిక్సింగ్ భాగోతం!
ఏం జరిగింది?
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలో రోమీ భిందర్ ఫోన్ వాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ACU) వెంటనే రంగంలోకి దిగింది. భద్రతా ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించినందుకు గాను రోమీ భిందర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగానే అత్యవసరంగా ఫోన్ వాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రోమీ భిందర్ వాదనతో సంతృప్తి చెందిన ఏసీఎస్‌యూ ఇన్వెస్టిగేటర్లు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని భావించారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం జరిమానా విధించి, భవిష్యత్తులో ఇలా జరగకూడదని హెచ్చరికతో వదిలేశారు.
Romi Bhinder mobile phone violation IPL 2026
Romi Bhinder Mobile Controversy: వైభవ్‌కు పూర్తి క్లీన్ చిట్
ఫోటోలో రోమీ భిందర్ పక్కనే కూర్చుని ఫోన్ వైపు చూస్తున్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై ఓ బోర్డు అధికారి మాట్లాడుతూ.. “వైభవ్ ఇంకా చిన్న అబ్బాయి. అతనికి నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఫ్రాంచైజీపై ఉంది. అంతేకానీ ఓ యువ ఆటగాడిని ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టడం లేదా భయపెట్టడం సరికాదు” అని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం నుంచి వైభవ్‌కు పూర్తి క్లీన్ చిట్ లభించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

