Dailyhunt
రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

వార్త 1 week ago

Rajendranagar Fire Accident: హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక సిద్ధి వినాయక క్లాత్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ షోరూంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న బట్టలు, ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

Read Also:Himachal Pradesh Crime: జామకాయ కోసిందని 4 ఏళ్ల చిన్నారిని బంధించిన మాజీ ఆర్మీ అధికారి!

Rajendranagar Fire Accident: తప్పిన ప్రాణాపాయం

షోరూంలో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మరియు కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

భారీగా ఆస్తినష్టం.. కారణం షార్ట్ సర్క్యూట్?

ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తండ్రి శవం పక్కనే ఐదేళ్ల బాలుడి రోదన.. అడవిలో హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha