Dailyhunt
తండ్రి శవం పక్కనే ఐదేళ్ల బాలుడి రోదన.. అడవిలో హత్య!

తండ్రి శవం పక్కనే ఐదేళ్ల బాలుడి రోదన.. అడవిలో హత్య!

వార్త 1 week ago

Annamayya district Crime: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఒక భీభత్సమైన సంఘటన జరిగింది. గాంధీ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని అడవిలోనే వదిలి వెళ్లారు.

ఈ సమయంలో గాంధీతో పాటు అతని ఐదేళ్ల కుమారుడు సందీప్ కూడా అక్కడే ఉన్నాడు. తన తండ్రిని చంపేస్తుంటే చూడలేక, భయంతో వణికిపోయిన ఆ పసివాడు.. గాఢాంధకారంలో, క్రూర మృగాలు తిరిగే అటవీ ప్రాంతంలో రాత్రంతా తన తండ్రి నిర్జీవ దేహం పక్కనే కూర్చుని రోదిస్తూ గడపడం అందరినీ కలిచివేస్తోంది.

Read Also:Himachal Pradesh Crime: జామకాయ కోసిందని 4 ఏళ్ల చిన్నారిని బంధించిన మాజీ ఆర్మీ అధికారి!

 Throat Slit Right in Front of His Own Son - Annamayya District Crime Report.

అంగన్వాడీ టీచర్‌కు వివరించిన బాలుడు.. వెలుగులోకి వచ్చిన కిరాతకం

మరుసటి రోజు ఉదయం వెలుతురు రాగానే, చిన్నారి సందీప్ ధైర్యం చేసి అడవి నుంచి బయటకు వచ్చాడు. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని చేరుకున్నాడు. అక్కడి టీచర్‌ను కలిసి తన తండ్రి చనిపోయాడని ఏడుస్తూ వివరించాడు. బాలుడి మాటలతో దిగ్భ్రాంతికి గురైన టీచర్, వెంటనే పిల్లాడిని వెంటబెట్టుకుని అటవీ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ గాంధీ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

Annamayya district Crime: నిందితుల కోసం పోలీసుల గాలింపు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు గాంధీని ఎవరు చంపారు? పాత కక్షలేమైనా ఉన్నాయా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఎదుర్కొన్న ఈ భయానక పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

భూపాలపల్లిలో సంచలనం రేపిన హత్య ఘటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha