Dailyhunt
రాజీనామా చేసి రండి. సామాన్య కార్యకర్తతోనే గెలుస్తాం" - కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ సవాల్

రాజీనామా చేసి రండి. సామాన్య కార్యకర్తతోనే గెలుస్తాం" - కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ సవాల్

వార్త 1 week ago

గుమ్మడిదల రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. 13వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన కాంగ్రెస్ నేత వెంటనే రాజీనామా చేసి మళ్లీ ప్రజల ముందుకు రావాలని బీఆర్‌ఎస్ నాయకులు బహిరంగ సవాల్ విసిరారు.

"మీ బలం ఎంతుందో ప్రజలే తీర్పు చెబుతారు… మేమైతే సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తాం" అంటూ గట్టిగా హెచ్చరించారు.సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రజల్లో మాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

Read Also:Vikram-1 Rocket Launch: నింగిలోకి హైదరాబాద్ రాకెట్ 'విక్రమ్-1'.. జెండా ఊపిన సీఎం రేవంత్!

రాజకీయంగా ఎదుర్కోలేక అబద్ధాల ఆరోపణలు చేయడం వారి బలహీనతకు నిదర్శనం" అంటూ మండిపడ్డారు."మా సిజిఆర్ కార్యాలయం జనతా గ్యారేజ్‌లాంటిదే… ఎప్పుడైనా, ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే మా పని" అని స్పష్టం చేశారు. "మాటలతో కాదు, పనితో చూపిస్తున్నాం… అందుకే కాంగ్రెస్ నేతలకు అసహనం పెరుగుతోంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. "ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది.

కానీ వాస్తవాలను వక్రీకరించడం, అభివృద్ధిని కించపరచడం మాత్రం తగదు" అన్నారు. కానుకుంట రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన పనులను గుర్తుచేస్తూ, "పనిచేసిన నాయకుడిని మట్టి కర్రతో కొట్టేలా మాట్లాడటం రాజకీయ దౌర్భాగ్యం" అని విమర్శించారు."వ్యక్తిగత దూషణలు మానండి… కుటుంబాలపై దిగజారిన వ్యాఖ్యలు ఆపండి. రాజకీయంగా పోరాడాలంటే అభివృద్ధి అంశాలపై చర్చించండి" అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

 Chimmula Govardhan Reddy CGR Trust

ఇక గుమ్మడిదల అభివృద్ధిపై అందరం కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ, "మండలానికి నిధులు తెచ్చుకోవాలంటే పార్టీలు పక్కనపెట్టి ఒకటిగా ముందుకు రావాలి" అన్నారు. జిల్లా మంత్రి రాజనర్సింహ హామీ ఇచ్చిన వంద పడకల ఆసుపత్రి సాధన కోసం కూడా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
"అభివృద్ధి చేయలేని వారు విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు… గుమ్మడిదల ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారు" అంటూ బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బర్నాల్ ట్వీట్‌తో కవిత కౌంటర్.. రాజకీయ హీట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha