Anantapur School Incident: అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దారుణంగా దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
Pune Crime: విషాదం.. కుమారుడితో కలిసి 18వ అంతస్తు పైనుంచి దూకిన మహిళ
పాఠశాలలో రంపంతో విచక్షణారహిత దాడి
తరగతి గది ప్రాంగణంలోనే ఉన్మాది విద్యార్థినిపై రంపంతో విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. రంపం ఘాతానికి బాలిక చేయి కూడా తెగిపోయినట్లు సమాచారం. దాడి జరుగుతుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని చూసిన సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలింపు
రక్తమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని తక్షణమే అనంతపురం సర్వజన (జీజీహెచ్) ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆసుపత్రిలో మంత్రి సత్యకుమార్ పరామర్శ
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గ్రీన్ ఛానల్ ద్వారా బెంగళూరుకు తరలింపు
బాధితురాలికి ముఖం, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కావడం మరియు అత్యవసర, మెరుగైన వైద్య సహాయం అవసరమవ్వడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించాలని నిర్ణయించారు. మంత్రి సత్యకుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ‘గ్రీన్ ఛానల్’ ఏర్పాటు చేసి ప్రత్యేక అంబులెన్స్‌లో బాలికను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల బృందం బాలికకు చికిత్స అందిస్తోంది.
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

