Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

వార్త 1 month ago

CV Anand appointed as Telangana DGP: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు.

ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న శివధర్‌రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ప్రభుత్వం ఆ స్థానంలో సీవీ ఆనంద్‌ను ఎంపిక చేసింది.

Read Also: Petrol Crisis: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ

CV Anand appointed as Telangana DGP: సీనియారిటీకే పట్టం

డీజీపీ రేసులో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రాల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించింది. అయితే, వీరిలో అందరికంటే సీనియర్ కావడంతో పాటు, గతంలో ఆయన నిర్వహించిన కీలక బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది.సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యమిశ్రా పేర్లనూ ప్రభుత్వం పరిశీలించింది.

ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్‌ సీనియర్‌ కావడంతోనే డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.నాలుగు రోజుల క్రితం.. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్‌ స్థానంలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి శిఖాగోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీవీ ఆనంద్‌ డీజీపీగా నియమితులవడంపై అప్పుడే స్పష్టత వచ్చినట్లయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బిఆర్ఎస్ పార్టీలో ముదిరాజ్ సంఘం నాయకుల భారీ చేరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha