Indiramma Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో రెండున్నర లక్షల (2.5 లక్షలు) ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ కీలక ప్రకటనలు చేశారు.
CM Revanth Reddy Indiramma Housing Scheme
సెప్టెంబర్ 17న లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు
పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే ఉన్న ఇళ్లతో పాటు కొత్తగా మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు సభ వేదికగా వెల్లడించారు. రాబోయే సెప్టెంబర్ 17వ తేదీ నాటికి లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని సీఎం టైమ్ లైన్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని తండాలు, గూడేల్లో నివసించే ప్రతి ఆదివాసీ కుటుంబాన్ని గుర్తించి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో గుడిసెలు లేని రోజే తమ ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు.
Indiramma Housing Scheme: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి సీఎం రేవంత్ హెచ్చరిక
వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరిస్తున్న వడ్లు, జొన్నలు, మక్కలను కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
“తెలంగాణ ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికైనా సిద్ధం. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి, కేంద్రం ధాన్యం కొనేలా ఒత్తిడి తీసుకురావాలి” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో జూన్ 15 నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుందని, ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు 62 లక్షల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Raed also:

