Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాత్రంతా సొరంగంలోనే మంత్రి నిమ్మల.. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలన

రాత్రంతా సొరంగంలోనే మంత్రి నిమ్మల.. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలన

వార్త 3 months ago

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు సొరంగంలోనే గడిపారు.

దాదాపు 20 గంటల పాటు టన్నెల్ లోపల ఉండి లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. చీకటి నిండిన కష్టతరమైన ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు, ఇంజనీర్లకు అండగా ఉండటానికే తాను అక్కడే ఉన్నానని ఆయన ప్రకటించారు. గత ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Dharmavaram ATM Robbery: ధర్మవరంలో ఎటిఎం ఎత్తుకెళ్లారు!

 Minister Nimmala inside Veligonda Tunnel

Veligonda Project: అడ్డంకులు తొలగించి నీటి విడుదల దిశగా అడుగులు

టన్నెల్‌లో ఇరుక్కుపోయిన టీబీఎం యంత్రాన్ని బయటకు తీసేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను వదిలేస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో అడ్వకేట్ జనరల్‌తో చర్చించి స్టే తొలగించామని మంత్రి వెల్లడించారు. క్లిష్టమైన కొండరాళ్లు పడుతున్నా జేసీబీ సాయంతో వెళ్లి యంత్రం స్థితిని ఆయన పరిశీలించారు. ఈ యంత్రాన్ని తయారు చేసిన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతుల కష్టాలు తీర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిని కాకుండా, రాష్ట్ర క్షేమం కోసం కష్టపడే వారికి అండగా ఉండాలని ఆయన కోరారు. పోలవరంతో పాటు మిగిలిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎమ్మెల్సీ అనంత బాబు సెంట్రల్ జైలుకు తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha