Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై కొత్త టెక్నాలజీతో టిక్కెట్ బుకింగ్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై కొత్త టెక్నాలజీతో టిక్కెట్ బుకింగ్

వార్త 3 months ago

RailOne App: భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే వార్త చెప్పింది. దాదాపు 40 ఏళ్లుగా వాడుతున్న పాత రిజర్వేషన్ పద్ధతిని మార్చి, కొత్త సాంకేతికతను తీసుకురావడానికి సిద్ధమైంది.

ఈ ఏడు ఆగస్టు నెల నుంచి సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల గతంలో టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వచ్చే సాంకేతిక సమస్యలు ఇకపై ఉండవు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మార్పులను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులకు వేగంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా టిక్కెట్లు దొరకాలన్నదే రైల్వే ప్రధాన లక్ష్యం.

Read also: Tamil Nadu: మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్‌

 Indian RailOne App booking interface

RailOne App: రైల్‌వన్ యాప్‌తో సూపర్ స్మార్ట్ సేవలు

ప్రయాణికుల సౌకర్యం కోసం 2025లో వచ్చిన 'రైల్‌వన్' సూపర్ యాప్ ఇప్పుడు కొత్త రూపు దాల్చింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల వెయిట్‌లిస్ట్ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంత ఉందో ముందే తెలుస్తుంది. గతంలో ఈ అంచనా సగం వరకే కచ్చితంగా ఉండేది, కానీ ఇప్పుడు అది 94 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఎంతో ధీమాగా ప్లాన్ చేసుకోవచ్చు. టిక్కెట్ బుకింగ్‌తో పాటు క్యాన్సిలేషన్, రీఫండ్ పనులు కూడా ఈ యాప్‌లో చిటికెలో పూర్తవుతాయి.

ఒకే చోట అన్ని రైల్వే సేవలు

ఈ కొత్త యాప్ కేవలం టిక్కెట్లకే పరిమితం కాకుండా ప్రయాణికులకు అవసరమైన అన్ని సేవలను అందిస్తోంది. అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు కూడా ఫోన్ ద్వారానే తీసుకోవచ్చు. అంతేకాదు, లైవ్ ట్రైన్ స్టేటస్, ఏ ప్లాట్‌ఫారమ్ మీదకు రైలు వస్తుంది, కోచ్ ఎక్కడ ఉంటుంది అనే విషయాలు ఈజీగా తెలుస్తాయి. ఫిర్యాదుల కోసం రైల్ మదద్ కూడా ఇందులో కలిపి ఉంచారు. ప్రస్తుతం రోజుకు 9 లక్షల పైగా టిక్కెట్లు ఈ యాప్ ద్వారా బుక్ అవుతుండటం దీని క్రేజ్‌ను తెలియజేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రూ.300 కోట్లు ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha