Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్!

వార్త 0 months ago

Indian Railways: రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెడుతూ..

త్వరలోనే సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా ఉదయం 10, 11 గంటలకు తత్కాల్ (Tatkal) టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగానే.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఒకేసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో ఐఆర్‌సీటీసీ సర్వర్లు తరచూ డౌన్ అవుతుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరికొత్త సర్వర్ టెక్నాలజీతో, అత్యంత వేగంగా టికెట్లు బుక్ చేసుకునేలా ఈ కొత్త పోర్టల్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేశారు.

Read Also : Ethanol -20 : విధానాలు, వివాదాలలో ఇథనాల్

Indian Railways: క్యాప్చాలు, పాప్-అప్‌లు అవుట్!

టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు తీవ్ర అసహనం కలిగించే క్యాప్చా (Captcha) కోడ్‌లను ఎంటర్ చేసే విధానాన్ని, అనవసరమైన పాప్-అప్‌లను (Pop-ups) ఈ కొత్త వెబ్‌సైట్ నుండి పూర్తిగా తొలగించారు. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది.

కొత్త వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు:

  • టికెట్ బుక్ చేయడానికి పేజీల కొద్దీ నింపే అవసరం లేకుండా బుకింగ్ స్టెప్స్‌ను చాలా వరకు తగ్గించారు.
  • ప్రతి క్లాస్ సీట్లను విడివిడిగా చెక్ చేసుకునే పనిలేకుండా.. అన్ని క్లాసుల (Sleeper, 3AC, 2AC, 1AC) సీట్ల లభ్యతను ఒకేసారి, ఒకే స్క్రీన్‌పై చూసుకునే సదుపాయం కల్పించారు.
  • ప్రయాణికుల వివరాలను (Passenger Details) ముందే సేవ్ చేసుకునేలా మార్పులు చేశారు. దీనివల్ల తత్కాల్ సమయంలో కేవలం ఒక్క క్లిక్‌తో వివరాలన్నీ ఆటోమేటిక్‌గా నిండిపోతాయి.

విప్లవాత్మక మార్పుల వల్ల సాధారణ ప్రయాణికులు ఏజెంట్ల సాయం లేకుండా, సైబర్ కేఫ్‌లకు వెళ్లకుండానే తమ మొబైల్స్ లేదా లాప్‌టాప్స్ ద్వారా క్షణాల వ్యవధిలో కన్ఫర్మ్డ్ రైలు టికెట్లను సొంతంగా బుక్ చేసుకోగలుగుతారు. ఈ కొత్త వెబ్‌సైట్ త్వరలోనే లైవ్‌లోకి రానుంది.

నైపుణ్య విద్యే ఉద్యోగ భద్రతకు పునాది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha