Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రమశక్తి అవార్డు అందుకున్న గొంగ్లూరు తాండ మోహన్ నాయక్

శ్రమశక్తి అవార్డు అందుకున్న గొంగ్లూరు తాండ మోహన్ నాయక్

వార్త 1 month ago

May Day 2026: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గిరిజన తండా కు చెందిన రామావత్ మోహన్ హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ భారత ప్రభుత్వంలో సీనియర్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ NFC INTUC యూనియన్ ఉపాధ్యక్షులు పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంక్షేమమునకు విశేష కృషి చేసినందుకు గాను నేడు మే డే పురస్కారం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ చే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే శ్రమశక్తి అవార్డును మే డే సందర్భంగా శుక్రవారం నాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన మే డే సభలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

Read Also : International Labour Day 2026: నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ప్రాముఖ్యత గురించి తెలుసా!

ఈ సందర్భంగా రామావత్ మోహన్ మాట్లాడుతూ… మే డే శుభ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే శ్రమశక్తి అవార్డుకు ఎంపిక కావడం నాకు ఎంతో ఆనందం, గర్వకారణం. నిరుపేద కుటుంబంలో జన్మించి, అనేక కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విభాగంలో పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎన్టీయూసీ తరఫున శ్రమశక్తి అవార్డుకు అర్హత పొందడం మరింత గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రమ శక్తీ అవార్డు అందుకున్న రామావత్ మోహన్ కు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, గొంగ్లూరు తాండ సర్పంచ్ సురేందర్ అభినందనలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కౌడిపల్లి లో ఘనంగా మే డే సంబరాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha