Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రజనీ - కమల్ మూవీపై సుందర్. సి సంచలన వివరణ

రజనీ - కమల్ మూవీపై సుందర్. సి సంచలన వివరణ

వార్త 1 month ago

Thalaivar 173 Updates: రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్‌తో గతేడాది ప్రకటించిన ప్రాజెక్ట్ సినిమా ప్రపంచంలో ఒక సెన్సేషన్.

సుందర్. సి దర్శకత్వంలో 2027 సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే, అనూహ్యంగా సుందర్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు.

Read Also: Trisha Tirumala Visit: త్రిష తిరుమల దర్శనం.. బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్

సుందర్. సి వివరణ

డైరెక్టర్ సుందర్ సి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేయడం నాకు తీవ్రమైన ఒత్తిడిగా అనిపించింది. గత 16 ఏళ్లుగా నాకు నచ్చిన విధంగా సినిమాలు చేస్తున్నాను. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నా ఆలోచనలను అందరికీ వివరించి ఒప్పించడం నాకు కష్టమైంది’ అని ఆయన తెలిపారు. కథను ప్రభావవంతంగా నేరేట్ చేయడంలో తనకు అంత బలంగా లేనని, అలాగే ఎవరైనా మార్పులు సూచిస్తే ఎక్కువగా వాదించకుండా రాజీ పడే స్వభావం తనదని ఆయన స్వయంగా అంగీకరించారు.ఈ ప్రాజెక్ట్ పరిమాణం, స్టార్ పవర్ దృష్ట్యా ప్రతి నిర్ణయం ఎంతో కీలకమవుతుంది.

రజనీకాంత్ కమర్షియల్ ఇమేజ్, కమల్ హాసన్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఈ రెండింటినీ సమతుల్యం చేయడం చిన్న విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నిర్ణయాలకు తావు ఉండదని, సినిమా మొత్తం అనేకమంది ఆలోచనల కలయికగా మారుతుందని సుందర్ సి గ్రహించారు. “నేను ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే ప్రారంభ దశలోనే తప్పుకోవడం మంచిదని భావించాను” అని ఆయన స్పష్టం చేశారు.

 Thalaivar 173 Updates, Sundar c

Thalaivar 173 Updates: రాజకీయ కారణాలు కూడానా?

సుందర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమై ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ బాధ్యతలు, మరోవైపు భారీ బడ్జెట్ సినిమా మేకింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమని భావించి ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను ఏ దర్శకుడు తీసుకుంటారో అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పుట్టినరోజున తిరుమలలో త్రిష.. విజయ్ పార్టీ విజయం కోసమేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha