Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రజినీకాంత్ భార్య కీలక ప్రకటన

రజినీకాంత్ భార్య కీలక ప్రకటన

వార్త 2 months ago

Rajinikanth Wife : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజినీకాంత్ తమిళనాడులో ఒక కీలకమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. సమాజంలో క్షేత్రస్థాయి మార్పుల కోసం ఆమె 'మక్కల్ మడై' (ప్రజల వేదిక) అనే సరికొత్త సామాజిక సంస్థను అధికారికంగా ప్రారంభించారు.

సమాజంలో అణచివేతకు గురవుతున్న మహిళలు, చిన్నారులు, మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడటమే ఈ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశమని లత ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను నేరుగా ఆలకించి, వాటి పరిష్కారానికి ఈ సంస్థ ఒక వారధిగా పనిచేస్తుందని ఆమె వివరించారు. తమిళనాడు రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయాలనుకునే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు మరియు సాధారణ పౌరులు ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చునని లతా రజినీకాంత్ పిలుపునిచ్చారు.

Read Also : జైపూర్‌లో ఉగాండా మహిళకు ఎబోలా వైరస్ !

రాజకీయాలకు దూరమంటున్న లత: భవిష్యత్తు రాజకీయ పునాదిగా విశ్లేషకుల అంచనా

తమ సంస్థ పూర్తిగా సామాజిక సేవా దృక్పథంతోనే పనిచేస్తుందని, ప్రస్తుతానికి దీనికి ఎలాంటి రాజకీయ రంగుగానీ, పొత్తులుగానీ లేవని లతా రజినీకాంత్ స్పష్టం చేశారు. అయితే, లత తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై తమిళనాడు రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు సుదీర్ఘకాలం ఎదురుచూసినప్పటికీ, ఆరోగ్యం మరియు ఇతర కారణాల వల్ల ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు లతా రజినీకాంత్ నేరుగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక పెద్ద వేదికను సిద్ధం చేయడం వెనుక బలమైన వ్యూహం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం సామాజిక సంస్థగా ప్రచారం పొందుతున్నప్పటికీ, భవిష్యత్తులో రజనీకాంత్ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావడానికి ఇదొక బలమైన పునాదిగా మారే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అన్నామలై నిష్క్రమణతో పార్టీకి నష్టం లేదు: తమిళనాడు బీజేపీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha