Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సన్నిధానం పోస్ట్ ఆఫీస్' మూవీ రివ్యూ!

'సన్నిధానం పోస్ట్ ఆఫీస్' మూవీ రివ్యూ!

వార్త 3 weeks ago

Sannidhanam Post Office Movie: కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు కథానాయకుడిగా, కీలక పాత్రధారిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఆయన అముత సారథి దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'.

జూన్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి, తాజాగా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయ్యప్పస్వామి భక్తి అంశాలు, ఒక తల్లి విశ్వాసం చుట్టూ తిరిగే ఈ చిత్రం ఏమేరకు మెప్పించిందో పరిశీలిద్దాం.

Read Also : Dil Raju: 'ఇరుముడి'పై దిల్ రాజు ప్రశంసలు.. రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు

 'Sannidhanam Post Office' Movie Review!

Sannidhanam Post Office Movie: కథ

యశోద (సితార) మాటలు రాని ఒక ఒంటరి మహిళ. ఆమెకు పదేళ్ల వయసున్న కొడుకు శబరి ఉంటాడు, అతనికి కూడా మాటలు రావు. కొడుకుకు మాటలు రావాలనే ఆశతో, కొంతమంది సలహా మేరకు అతనికి అయ్యప్పస్వామి మాల వేయించి పులిమేడు సన్నిధానానికి తీసుకువస్తుంది. అక్కడ శబరికి దాహంగా ఉండటంతో యశోద మంచినీళ్లు తేడానికి వెళ్లి, 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్' దగ్గర నిలబడ్డ కొడుకును కోల్పోతుంది.

అదే సమయంలో అనుకోకుండా ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో పోలీసులు యశోదను అరెస్ట్ చేస్తారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటంతో ఆమె నిర్దోషిగా బయటకు రావడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత యశోద తన కొడుకుని కలుసుకోగలిగిందా? తల్లి నుంచి తప్పిపోయిన శబరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అయ్యప్పస్వామి లీల ఈ తల్లికొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేర్చింది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ

అయ్యప్పస్వామి మహిమలపై గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. సాధారణంగా ఈ తరహా సినిమాలు శబరిమల దీక్షా కాలంలో విడుదలవుతుంటాయి, కానీ ఈ చిత్రాన్ని జూన్ మాసంలో విడుదల చేశారు. కథాంశం పరంగా అయ్యప్పపై ఒక తల్లికి ఉన్న దృఢమైన నమ్మకం అనే పాయింట్ బాగున్నా, దానిని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తీవ్రంగా విఫలమయ్యాడు.

ఫస్టాఫ్‌లో కొడుకు తప్పిపోవడం, యశోద జైలుకు వెళ్లడం వంటి సన్నివేశాలతో నడిపించి, సెకండాఫ్‌లో వీరిద్దరి కలయిక చుట్టూ కథనం సాగుతుంది. అయితే తల్లి కొడుకుల మధ్య ఉన్న వేదనను, ఆ వియోగాన్ని ప్రతిబింబించే ఎమోషనల్ సీన్లు ఏమాత్రం కదిలించలేకపోయాయి. ప్రేక్షకులను కథలో మమేకం చేసే 'ఆత్మ' ఈ సినిమాలో కనిపించదు. కామెడీ వర్కవుట్ కాకపోవడం, సన్నివేశాలు డ్రామాను తలపించేలా కృతకంగా ఉండటంతో సినిమా నీరసంగా సాగుతుంది.

నటీనటులు & సాంకేతిక వర్గం

యోగిబాబు సినిమా అయినప్పటికీ ఆయన మార్క్ కామెడీ ఎక్కడా కనిపించదు. సితార, యోగిబాబు తమ పాత్రల పరిధి మేరకు సహజమైన నటనను కనబరిచారు. వినోద్ భారతి ఫొటోగ్రఫీ, ఏజీఆర్ నేపథ్య సంగీతం, పొన్ కథిరేశ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా మాత్రమే ఉన్నాయి. అయ్యప్పస్వామి మహిమలలో ఒక విశేషంగా ఈ కథను చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం సరియైన సన్నివేశాల బలం లేకపోవడంతో ఫలించలేదు.

వరుసగా మూడు.. రూ. 200 కోట్లతో మమిత బైజు సరికొత్త రికార్డు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha