Veligonda project updates: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు నిధులు విడుదల ప్రక్రియ వేగవంతం అయింది. సీఎం చంద్రబాబు శనివారం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు నిధులు విడుదల చేస్తూ ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది.
Read also: YS Jagan: అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని ఖండించిన జగన్
Funds released for Veligonda project
వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులు
ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వివరించారు. మొత్తం వ్యయం రూ.10,580 కోట్లుగా అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.759 కోట్లు వెచ్చించామని ఆయన చెప్పారు. ఇప్పుడు అదనంగా మరో రూ.905 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో మిగిలిన నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Veligonda project updates: సోమవారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు
పునరావాసం, పునరుద్ధరణ కింద కేటాయించిన రూ.300 కోట్లను సోమవారం నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు చేరనున్నాయి. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తూ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Epaper: epaper.vaartha.com

