Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండు నిమిషాలు చాలు వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టేందుకు.. సీఎం

రెండు నిమిషాలు చాలు వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టేందుకు.. సీఎం

వార్త 14 hrs ago

CM Chandrababu: రాజకీయం ముసుగులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు, వివాదాలకు చెక్ పెట్టడానికి తమ ప్రభుత్వానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలని హెచ్చరించారు.

Read Also : Minister Lokesh : పొగాకు రైతులకు ఊరట - కిలోకు రూ.10 చొప్పున ఆర్థిక సాయం : మంత్రి లోకేశ్

 Two minutes are enough to put an end to YCP’s atrocities: CM

CM Chandrababu: డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపు

ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియపై న్యాయస్థానాలు చివాట్లు పెట్టినా పట్టించుకోకుండా, వైసీపీ శ్రేణులు కావాలనే వివాదాలు సృష్టిస్తూ రాద్ధాంతం చేస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ వ్యవహారంలో ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని, తప్పుడు ఆరోపణలను టీడీపీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించారు.

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. ఆయన ఎక్కడైనా పరామర్శల పేరుతో బయటకు వస్తున్నారంటేనే అసలు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేబినెట్ సహచరులకు సూచించారు.

అమరావతికి కేంద్ర విద్యాసంస్థ 'నీలిట్' - దేశంలోనే తొలి క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha