Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపటి నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ

రేపటి నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ

వార్త 2 months ago

Mrigashira 2026-Chepa Prasadam : మృగశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రేపు రాత్రి 9 గంటల నుంచి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరుల ఆధ్వర్యంలో 'చేప ప్రసాదం' పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ విశిష్ట ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తొక్కిసలాటలు, ఇబ్బందులు జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలు, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణపై మంత్రులు ప్రత్యేక సమీక్ష నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Read Also : పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత ఫైర్

40 వేల కొర్రమీను పిల్లలు సిద్ధం.. ప్రత్యేక రవాణా సౌకర్యాలు

ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్య శాఖ సమన్వయంతో దాదాపు 40 వేల కొర్రమీను (Murrel) చేప పిల్లలను పంపిణీ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచారు. శ్వాసకోశ సమస్యలకు ఈ ప్రసాదం ఎంతో మేలు చేస్తుందనే నమ్మకంతో వచ్చే సాధారణ ప్రజలు, వృద్ధుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో హైదరాబాద్ చేరుకునే వారి కోసం TSRTC ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. సికింద్రాబాద్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వంటి ప్రధాన కేంద్రాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఈ బస్సులు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha