Dailyhunt
రేపటితో ముగియనున్న ఎప్ సెట్ దరఖాస్తు గడువు

రేపటితో ముగియనున్న ఎప్ సెట్ దరఖాస్తు గడువు

వార్త 0 months ago

TG EAPCET : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఈఏపి(ఎప్) సెట్-2026కి సంబంధిం చిన దరఖాస్తు గడువు రేపటి(ఏప్రిల్ 4)తో ముగియనుంది.

అపరాధ రుసుంతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఇప్పటి వరకు 2.70 లక్షలకిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్కి 1.90 లక్షల దరఖాస్తులు రాగా, అగ్రికల్చర్, ఫార్మసీకి 79వేల దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ జారీ చేయగా.. ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం ప్రారంభించారు.

Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు

 TG EAPCET: The application deadline for EAPCET ends tomorrow

ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు

ఏప్రిల్ 4 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరించ నున్నారు. అపరాధ రుసుం రూ. 10వేలతో మే 2 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500 కాగా.. ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. రెండు పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్
అభ్యర్థులకు రూ.1000 కాగా, ఇతరులకు రూ. 1800గా నిర్ణయించారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 10 వరకు, రూ.500తో ఏప్రిల్ 15 వరకు, రూ. 25005 ລ້ 20 ລ້, 5. 5000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 24 వరకు స్వీకరించనుండగా.. అపరాధ రుసుం రూ. 10వేలతో మే 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను.. స్వీకరించనున్నారు. అగ్రికల్చర్ పరీక్షలను మే 4, 5 తేదిల్లో నిర్వహించనుండగా.. మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించ నున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

విద్యుత్ షాక్తో మరణిస్తే రూ.8 లక్షలకు పరిహారం పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha