Dailyhunt
రేపే తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. చెక్ చేయండి ఇలా!

రేపే తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. చెక్ చేయండి ఇలా!

వార్త 1 week ago

TS SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది.

మే మొదటి వారంలో వస్తాయని భావించిన ఫలితాలను, రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తి చేసి రేపు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షల ప్రక్రియలో, కేవలం 10 రోజుల్లోనే పేపర్ల దిద్దుబాటు పూర్తి చేసి అధికారులు సత్తా చాటారు.

Read Also : Hyderabad Crime: హైదరాబాద్‌లో అమానుషం.. వీధి కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం

 Telangana 10th results tomorrow: Innovative results on WhatsApp..

TS SSC Results 2026: సర్వర్ల టెన్షన్ లేదు.. వాట్సాప్‌లోనే రిజల్ట్స్!

సాధారణంగా ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్లు మొరాయించడం, సర్వర్ రద్దీ వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవ్వడం చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు ఈసారి వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారానే ఫలితాలను చిటికెలో తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌లో ఫలితాలు పొందే విధానం:

  1. ఇప్పటికే వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ పొందిన వారికి నేరుగా రిజల్ట్ మెమో మెసేజ్ రూపంలో అందుతుంది.
  2. కొత్తగా చూసుకోవాలనుకునే వారు 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని పంపాలి.
  3. ఆపై మెనూలో ‘SSC Results’ ఎంపిక చేసుకుని, హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. ఫలితం మీ స్క్రీన్ పై కనిపిస్తుంది.

ఈ వినూత్న సాంకేతికత వల్ల విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే ఉండి తమ ప్రగతిని తెలుసుకోవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇద్దరు కుమారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య! ఆ ఇంట్లో అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha