PM Modi meeting with CMs: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావం, భవిష్యత్తు పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ అంశంపై మాట్లాడిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఇది భారత్‌కు కూడా సవాలుగా మారిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు వంటి అత్యవసర వస్తువుల సరఫరా మార్గాలకు ఆటంకం కలగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. అయితే, దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ఇంధన భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.
Read Also : Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్‌లు..ఏఐ కారణమేనా?
Modi to discuss West Asia situation
PM Modi meeting with CMs: ప్రవాస భారతీయుల భద్రత
పశ్చిమాసియా దేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో సుమారు కోటి మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. యుద్ధం తీవ్రతరమైతే వారి భద్రత మరియు జీవనోపాధిపై ప్రభావం పడుతుందనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆందోళన. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకల్లోని భారతీయ సిబ్బందిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ భూమి నుంచి సుమారు 4.25 లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది. ఇందులో ఇరాన్ నుంచి వచ్చిన 1000 మందిలో 700 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం.
శాంతి చర్చల దిశగా భారత్ అడుగులు
ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంతి, చర్చల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యుద్ధ ప్రభావం భారత్‌పై తక్కువగా ఉండటానికి మన ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉండటమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక దేశాల నాయకులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, కరోనా కాలం నాటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. నేటి ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రాలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పుతో బుద్ధి చెప్పిన విద్యార్థిని

