Dailyhunt
రేపు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

వార్త 1 week ago

పీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శుక్రవారం) కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. 'పేదల సేవలో' కార్యక్రమంతో పాటు మేడే వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా తొలుత పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలానికి చేరుకుంటారు. ఉదయం 10:25 గంటలకు పమిడిముక్కలలో ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను అందజేస్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.63,158 కోట్లను పెన్షన్ల రూపంలో అందించగా, కృష్ణా జిల్లాలో ప్రతి నెలా 2.34 లక్షల మందికి రూ.102 కోట్లను పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకోనున్నారు.

Read Also : అమరావతి పనులా లేక ప్రజల కష్టాలా?: షర్మిల

మేడే సందడి.. భవన నిర్మాణ కార్మికులతో భేటీ

మే 1వ తేదీ ‘మేడే’ (కార్మిక దినోత్సవం) పురస్కరించుకుని ముఖ్యమంత్రి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, క్షేత్రస్థాయిలో వారితో సమయం గడపనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు వీరంకిలాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. కార్మికుల సంక్షేమం, భవన నిర్మాణ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై వారితో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 01:55 గంటలకు పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం మరియు స్థానిక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం

పర్యటన ముగింపు దశలో ముఖ్యమంత్రి ఆరోగ్య రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 03:50 గంటలకు గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించిన అనంతరం, సాయంత్రం 04:45 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

టెన్త్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha