Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ.. ఈ నిబంధనలు పాటిస్తేనే పరీక్షకు అనుమతి

రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ.. ఈ నిబంధనలు పాటిస్తేనే పరీక్షకు అనుమతి

వార్త 3 weeks ago

NEET UG 2026 Exam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ (NEET-UG) పరీక్షకు ఎన్టీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష సజావుగా సాగేలా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also:TG Inter Supplementary Exams 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

NEET UG 2026 Exam: సైబరాబాద్ పరిధిలో సెక్షన్ 163 అమలు

నీట్ 2026 పరీక్ష మే 3, ఆదివారం నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్‌లోని 163 సెక్షన్ అమలులో ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరీక్ష కేంద్రాల వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

 NEET UG 2026

మధ్యాహ్నం 2.00 నుంచి 5.20 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోపు హాజరుకావాలి. పురుషులు క్యాజువల్ ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్ మాత్రమే ధరించాలి, చెప్పులు మాత్రమే అనుమతి. విద్యార్థినులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు, సింపుల్ చెప్పులు ధరించాలి. మెహింది, హ్యాండ్‌బ్యాగులు, పర్సులు నిషేధం. హాల్ టిక్కెట్, ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు తప్పనిసరి. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బీమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha