Dailyhunt
రేషన్ కుంభకోణంలో నటి నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసులు

రేషన్ కుంభకోణంలో నటి నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసులు

వార్త 1 week ago

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి కొనసాగుతున్న తరుణంలో, రేషన్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాజీ ఎంపీ, ప్రముఖ నటి నుస్రత్ జహాన్‌కు అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Read Also: Anasuya Bharadwaj: అనసూయ ఫిర్యాదుతో యాక్షన్.. సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడు అరెస్ట్!

 ED notices to actress Nusrat Jahan in ration scam

విచారణకు హాజరుకావాలని ఆదేశం

రేషన్ అక్రమ రవాణా వ్యవహారంలో నుస్రత్ జహాన్‌ను ప్రశ్నించేందుకు ఏప్రిల్ 22న కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. అయితే, ప్రస్తుతం ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె కోల్‌కతా కార్యాలయానికి బదులుగా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవుతానని అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

West Bengal: బంగ్లాదేశ్‌కు రేషన్ అక్రమ రవాణా

2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని బషీర్‌హట్ సరిహద్దుల నుండి బంగ్లాదేశ్‌కు అక్రమంగా గోధుమలు, బియ్యాన్ని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నుస్రత్ జహాన్ బషీర్‌హట్ నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ అక్రమ రవాణాలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె పాత్రపై ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పుడు ఎన్నికల ముందే ఆమెకు నోటీసులు రావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha