Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్‌ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

రేవంత్‌ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

వార్త 2 months ago

KTR: బెంగళూరు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు జర్మనీ నియంత హిట్లర్ స్ఫూర్తి అని, హిట్లర్ శత్రువులను అణచివేయడానికి 'హైడ్రా' అనే ప్రత్యేక బృందాన్ని ఉపయోగించేవాడని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని వదిలేసి నియంతృత్వాన్ని నమ్ముకుంటున్నారని ఆరోపించారు.

read also:TGPSC AEE Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. AEE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కూల్చివేతల పాలనపై విమర్శలు

“మీ ఆదర్శం హిట్లర్, మీ విధ్వంసక సంస్థ పేరు హైడ్రా” అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ప్రజల ఇళ్లను, నిర్మాణాలను కూల్చివేయడాన్ని ఒక గొప్ప విషయంగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, ఇది నియంతల ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని విమర్శించారు.

KTR: బీఆర్ఎస్ పాలన – ప్రజాస్వామ్య విలువలు

తమ గత ప్రభుత్వ పాలనను గుర్తు చేస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మేము మీ అంత తెలివైన వాళ్లం కాకపోవచ్చు, కానీ మాకు దేశ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజారంజక పాలన సాగించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha