Indiramma Sarees Distribution: సదాశివపేట, మే 31:తెలంగాణ ఆడపడుచులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిరు కానుక అందించింది. రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ అగ్రతాంబూలం ఇస్తూ, వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని సదాశివపేట 19వ వార్డు కౌన్సిలర్ రోజా నాగరాజు గౌడ్ పేర్కొన్నారు.
సదాశివపేట పట్టణంలోని ప్రముఖ సంగమేశ్వర మందిరంలో ఆదివారం ఐకేపీ, డ్వాక్రా (SHG) మహిళా సంఘాల సభ్యులకు ‘ఇందిరమ్మ చీరల’ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Read Also : తెలంగాణలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడగింపు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కౌన్సిలర్ రోజా నాగరాజు గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ కలిసి మహిళలకు ఉచితంగా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్వాక్రా గ్రూపుల్లోని ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
Indiramma Sarees Distribution: అన్ని రంగాల్లో ప్రగతి..
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIC) చైర్‌పర్సన్ టి. నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల ప్రత్యేక సహకారంతో సదాశివపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాయకులు గుర్తుచేశారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతోనే అటు రాజకీయాల్లోనూ, ఇటు వ్యాపార రంగంలోనూ ప్రభుత్వం వారికి ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలు అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ ఆర్పీలు (Resource Persons) కిరణ్మయి, విజయ, సుజాతలతో పాటు సంఘాల ప్రతినిధులు మంగమ్మ, రుక్మిణి, సావిత్రి, వార్డు ప్రజలు మరియు లబ్ధిదారులైన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

