Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పెద్ద మనసును చాటుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో పనిచేసే 11 మంది గ్రౌండ్స్‌మెన్‌కు తలో రూ.
10 లక్షల చొప్పున మొత్తం రూ. 1.10 కోట్లను అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొన్ని నెలల క్రితం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు.
Read Also:SRH vs RCB: ఆరెంజ్ ఆర్మీ బోణీ కొట్టేనా? ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ 'ఢీ'
Hardik Pandya gift to Wankhede ground staff
ఆర్మీ తరహా శిక్షణ - గ్రౌండ్ స్టాఫ్ సహకారం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు ముందు హార్దిక్ పాండ్యా తన ఫిట్‌నెస్ మరియు ఫామ్ కోసం వాంఖడే స్టేడియంలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడి 11 మంది సిబ్బంది తమ విధులు ముగిసినా కూడా హార్దిక్ కోసం ప్రత్యేకంగా వేచి ఉండేవారు. పిచ్ సిద్ధం చేయడం నుండి నెట్స్ పర్యవేక్షణ వరకు వారు అందించిన సహకారానికి మెచ్చిన హార్దిక్, వారికి మంచి బహుమతి ఇస్తానని అప్పుడే వాగ్దానం చేశారు.
Hardik Pandya: వరల్డ్ కప్ విజయం తర్వాత హామీ అమలు
వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా టైమ్‌తో పని లేకుండా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా వాంఖడేలో రాత్రి వేళ్లల్లో ఎక్కువ సేపు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. ఆ సమయంలో హార్దిక్‌కు గ్రౌండ్స్‌మెన్ చాలా సహకరించాడు. హార్దిక్ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే అంతసేపు సహకరించారు. దాంతో పాండ్యా ఆ రోజే వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వారిని సత్కరించి అందరి హృదయాలు గెలుచుకున్నాడు.
టీ20 వరల్డ్‌కప్ ముందు గ్రౌండ్స్‌మెన్ అందరికీ హార్దిక్ పాండ్యా మాట ఇచ్చాడు. ఛాంపియన్‌గా నిలిస్తే కచ్చితంగా అందరికీ కృతజ్ఞతలు చెబుతానని తెలిపాడు. అలాగే టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత మళ్లీ వాంఖడేకి వచ్చి ఒక్కొక్క గ్రౌండ్‌మెన్‌కి రూ. 10 లక్షల చొప్పున నగదు అందించడమే కాకుండా, గిఫ్ట్‌లు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆనందంగా అందరికీ ఫొటో కూడా దిగాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

