Gajwel Road Accident: కారు అతివేగంతో డివైడర్ ఢీ కొట్టి రోడ్డు అవతల పక్కన ఉన్న లారీకి తగలడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శివారులో ఉన్న రింగ్రోడ్ పై చోటు చేసుకున్నది వివరాలు ఇలా ఉన్నాయి ఇబ్రహీంపట్నం కు చెందిన గౌతం (21) అఖిల్(23) అనిరుద్ బోడుప్పల్ కు చెందిన ప్రేమ్ వీరి వృత్తి ఫోటోగ్రాఫర్లు హైదరాబాదు నుండి సిద్దిపేటకు వెళ్లి శివం గార్డెన్ లో జరిగిన శుభకార్యం లో పాల్గొని తిరిగి హైదరాబాదుకు వెళుతుండగా,
Read Also:Meerpet Chit Fund Scam: మీర్‌పేటలో భారీ చిట్ ఫండ్ మోసం! రూ. 2 కోట్లతో భార్యాభర్తలు జంప్
పోలీసుల వేగవంతమైన చర్యలు
మార్గమధ్యంలో ఉన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శివారులోని రింగ్రోడ్డుల వద్ద డివైడర్ కు ఢీకొని అవతల రోడ్డులో ఉన్న లారీని బలంగా ఢీకొగా కారులో ప్రయాణిస్తున్న గౌతమ్ అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమ్, అని రూపల కు తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసిపి నరసింహులు సీఐ రవి కుమారులు హుటాగొట్టిన సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన యువకులను ప్రభుత్వాసుపత్రికి తరలించడంతోపాటు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

