Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాపు నేతల కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అధికార పీఠంపై ఉన్నవారు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబడుతూ.. “ఆయన అసలు ఏమనుకుంటున్నారు? మేమంతా రౌడీలమా? నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదు. నిజానికి ‘రౌడీ’ అనే పదం మాకు కాదు, అది పక్కాగా ఆయనకే వర్తిస్తుంది” అంటూ బొత్స అత్యంత ఘాటుగా తిరుగుదాడి చేశారు.
Read Also : శ్రీశైలంలో 1000 మందితో యోగా దినోత్సవం

రాజ్యాంగ పదవికి అర్హుడేనా? బొత్స ప్రశ్న
నేరగాళ్ల పట్ల పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఎవరైనా క్రిమినల్ అయితే పోలీసులు వారిని నేరుగా తీసుకెళ్లి చంపేస్తారా? అలా ఎన్కౌంటర్లు చేయాలని ఏ రాజ్యాంగంలోనైనా రాశారా? అని ఆయన గట్టిగా నిలదీశారు. చట్టం, న్యాయస్థానాలు, ప్రజాస్వామ్య సూత్రాలు ఉన్న దేశంలో.. ఇలాంటి చట్టవ్యతిరేకమైన మాటలు మాట్లాడే వ్యక్తి డిప్యూటీ సీఎం వంటి ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగేందుకు అస్సలు అర్హుడు కాదంటూ బొత్స ధ్వజమెత్తారు. పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించాలే తప్ప, ఇలాంటి వ్యాఖ్యలతో సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

