Bhatti Vikramarka: హైదరాబాద్ నగర విశిష్ట సంస్కృతికి, గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం) స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ఒక నిలువెత్తు నిదర్శనమని తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు.
సాలార్‌జంగ్ మ్యూజియం 75వ వార్షికోత్సవం (ప్లాటినం జూబ్లీ) తో పాటు సాలార్‌జంగ్-III (మీర్ యూసుఫ్ అలీ ఖాన్) 137వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న సంస్కృతులు, భిన్న విశ్వాసాల సమాహారంగా ఉన్న ఈ మ్యూజియం మరింత అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
Musi River Salar Jung Museum
జాతీయ సంపద ‘సాలార్‌జంగ్ మ్యూజియం’: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ఈ ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. సాలార్‌జంగ్ మ్యూజియం కేవలం ఒక ప్రదర్శనశాల మాత్రమే కాదని, అది దేశం గర్వించదగ్గ ఒక అపురూపమైన జాతీయ సంపద అని అభివర్ణించారు. వివిధ సంస్కృతుల మధ్య ఇది వారధిలా నిలుస్తోందని ప్రశంసించారు. జూన్ 14 నుంచి 21 వరకు వారం రోజుల పాటు జరిగే ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను వేదికగా చేసుకుని, ఈ మ్యూజియం యొక్క చారిత్రక విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
Read also: Telangana Private School Fee : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Bhatti Vikramarka: ఒకే ఒక్కడి అరుదైన కళా ప్రపంచం
సాలార్‌జంగ్-III గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్, తన జీవితకాలంలో ఒంటరిగా సేకరించిన అత్యంత అరుదైన, అమూల్యమైన కళాఖండాల కలయికే ఈ సాలార్‌జంగ్ మ్యూజియం. 1951లో చారిత్రాత్మక మూసీ నది ఒడ్డున ఏర్పాటైన ఈ మ్యూజియం, కాలక్రమేణా దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనశాలల్లో ఒకటిగా రూపాంతరం చెందింది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం, దీనిని ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

