Kesineni Nani: విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, చట్టపరంగా తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం ఒక మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ వివాదం, ప్రస్తుతం 'లాకప్ డెత్' (Lockup Death) ఆరోపణలతో దేశ రాజధానికి చేరింది.
ఈ ఉదంతంపై మాజీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల నిర్వాకం వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడంటూ ఆయన తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు.
Kesineni Nani NHRC Complaint
Read also: Chittoor Mango farmers protest: కిలో 5 రూపాయలేనా? మామిడి ధరలపై వైసీపీ నిరసన!
సాక్ష్యాధారాల నాశనం.. కృష్ణా నదిలో అస్థికల నిమజ్జనం?
కేశినేని నాని తన ఫిర్యాదులో విజయవాడ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసుల థర్డ్ డిగ్రీ హింస కారణంగానే సాయికృష్ణ మరణించాడని ఆయన ఆరోపించారు. ఒకవేళ మృతదేహాన్ని అప్పగిస్తే ఒంటిపై ఉన్న గాయాలు బయటపడతాయనే భయంతో, పోలీసులు అత్యంత రహస్యంగా దహన సంస్కారాలు పూర్తి చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫోరెన్సిక్ పరీక్షలు లేదా డీఎన్ఏ (DNA) ఆధారాలు లభించకుండా చేయాలనే పక్కా వ్యూహంతోనే, సాయికృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపేశారని నాని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
Kesineni Nani: ప్రైవేట్ సెటిల్‌మెంట్ల సిండికేట్‌గా పోలీస్ వ్యవస్థ!
విజయవాడలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనేది కాగితాలకే పరిమితమైందని మాజీ ఎంపీ విమర్శించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన రక్షక భట నిలయాలు.. నేడు మాఫియా శక్తులకు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. నగరంలో కొందరు పోలీస్ అధికారులు ప్రైవేట్ సెటిల్‌మెంట్లు చేసే సిండికేట్‌గా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేశినేని నాని ప్రధాన లీగల్ డిమాండ్లు
ఈ లాకప్ డెత్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశినేని నాని ఎన్హెచ్ఆర్‌సీ (NHRC) ముందు రెండు కీలక చట్టపరమైన డిమాండ్లను ఉంచారు:
- కమిషనర్ సస్పెన్షన్: ఈ ఘోరానికి శాఖాపరమైన పూర్తి బాధ్యత వహిస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేయాలి.
- జ్యుడీషియల్ విచారణ: సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, పోలీసుల చేతిలో జరిగిన హత్య ఉదంతంపై సెక్షన్ 176(1ఏ) ప్రకారం తక్షణమే ఒక స్వతంత్ర జ్యుడీషియల్ విచారణకు (Judicial Inquiry) ఆదేశించాలి.
ఈ ఫిర్యాదుతో విజయవాడ పోలీస్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

