Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సదాశివపేట అధికారులపై చైర్మన్ ఫైర్

సదాశివపేట అధికారులపై చైర్మన్ ఫైర్

వార్త 1 week ago

Sadashivpet: సదాశివపేట పురపాలక సాధారణ సమావేశం రసాభాసగా సాగింది. అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై తనదైన శైలిలో శృతి మెత్తగా వార్నింగ్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ అంజమ్మ ….

పారిశుద్ధ్య నిర్వహణ నీటి సమస్య పన్నుల విషయంలో అధికారులకు కౌన్సిలర్లకు మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఎజెండాలోని అంశాలను చదివి వినిపించినప్పటికీ వాటిపై కౌన్సిలర్లు దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులకు, ప్రజాధనాన్ని జీతం రూపంలో తీసుకుంటున్న అధికారులకు మధ్య సదాశివపేట మున్సిపల్ సాధారణ సమావేశము వాడి వేడిగా జరిగింది.

Read Also:NEET-UG 2026: నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

 Sadashivpet Municipal Meeting

మున్సిపల్ చైర్మన్ అంజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారుల పనితీరుపై ఆమె మండిపడ్డారు. గతంలో కూడా చాలాసార్లు చెప్పానని పనుల విషయంలో అజాగ్రత్త చేస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా వచ్చిన 50 కోట్ల నిధుల ఖర్చు, ఎనిమిది కోట్ల నిధులు వాపస్ పోవడంపై 25 వ వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు ఇంజనీర్ రాజేష్ సరి అయిన సమాధానాలు చెప్పినట్లు కనిపించలేదు. ఇంటి పన్నుల విషయంలో ఎక్కువ వేసి తగ్గించడం, అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఫంక్షన్ హాల్ రిజిస్టర్ ఆఫీస్ లాంటి పెద్ద బిల్డింగ్లలో కూడా ట్యాక్స్ ఎందుకు తగ్గించాలని మేనేజర్ ని నిలదీయగా ఆయన సమావేశంలో సరైన సమాధానం చెప్పలేడు. నల్ల కలెక్షన్ బిల్లులు తీసుకుంటున్నారు కానీ నీళ్ళు చాలా రోజులగా రావడం లేదని శంకర్ గౌడ్ అడగగా దానికి ఇంజనీర్ బదిలిస్తూ ఆ ప్రాంతంలో నీళ్లు రావని ఇంకొక ట్యాంకు కట్టే వరకు అది అంతే అని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో రెచ్చిపోయిన కౌన్సిలర్ మా వార్డు ప్రజలందరూ ఖాళీ బిందెలతో మీ మున్సిపల్ ఆఫీసు వద్ద కూర్చుంటామని కోపంగా అన్నారు.

ఉదయం 9 గంటల వరకు కూడా లైట్లు వెలుగుతూనే ఉంటాయని 17వ వార్డు కౌన్సిలర్ అన్నాడు. పారిశుద్ధ్యం విషయంలో రెగ్యులర్ గా పారిశుద్ధ్య సిబ్బంది వార్డుకు రావడంలేదని దీనివలన తడి పొడి చెత్తను ఇంట్లోనే పెట్టుకోవలసి వస్తుందని 13వ వార్డు కౌన్సిలర్ విశాలి నాగరాజు గౌడ్ అడగగా సిబ్బంది తక్కువ ఉండడం వలన మరియు చెత్త వాహనము పాడైపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని శానిటరీ ఇన్స్పెక్టర్ అన్నారు. సమావేశం గురించి మాకు సమాచారం అందడం లేదని ఒకటవ వార్డ్ కౌన్సిలర్ పని కృష్ణ అడగగా గ్రూప్ లో పెట్టామని కమిషనర్ బదులిచ్చారు. అన్ని పత్రాలు సరిగా ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ఇంటి నెంబర్ ఇవ్వకుండా ఆఫీసులో చుట్టూ తిప్పుకుంటున్నారని శంకర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు గౌస్ సమాధానం ఇస్తూ ఇన్వార్డ్ నుంచి మాకు పత్రాలు అందడం లేదని చెప్పిన ఆయన జవాబుకు బదులిస్తూ ఇన్వార్డ్ ఎక్కడో దూరంలో లేదని ఇంటి నెంబర్ ఇస్తే అన్ని రూపంలో మునిసిపల్ కు ఆదాయం వస్తుందని గుర్తు చేశారు.

ప్రతి వార్డుకు కొత్తగా వేస్తున్న బోర్లలో కేసింగ్ కానీ బోర్ మోటార్లు కానీ నాణ్యమైనవి లేవని నాలుగవ వార్డ్ కౌన్సిలర్ నజీరుద్దీన్ అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కానీ సిద్ధాపూర్ రోడ్ లోని మటన్ దుకాణాలను పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణాల సముదాయము బ్లాక్ ఆఫీస్ ముందు నిర్మించిన చిన్న వ్యాపారస్తుల షెడ్లను ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రజాధనంతో నిర్మించి ఉపయోగం లోకి తీవకపోవడంపై 17 వ వార్డు కౌన్సిలర్ సజీ అధికారులను నిలదీశాడు. 8 సంవత్సరాలుగా మునిసిపల్ ఆధీనంలో ఉన్న షాపులు కానీ ఇతరత్రా ఆదాయ వనరుల వేలం పాటలు పెట్టకపోవడంపై మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని ఎందుకు పెట్టడం లేదని అడగగా త్వరలోనే పెడతామని అన్నారు.

Sadashivpet: ప్రజాధనం వృథా

తమ వార్డులోని డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యలపై ఎవరికి చెప్పినా పనులు జరగడం లేదని 23 వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ ప్రియా అన్నారు. కౌన్సిలర్లు అడిగిన అనేక ప్రశ్నలకు సంబంధించిన అధికారులు జవాబు చెప్పలేక క్రింది స్థాయి అధికారులపై ఆధార పడాల్సి వచ్చినట్లు సమావేశంలో కనిపించింది. పరిపాలనకు సంబంధించి 26 వార్డులకు గాను కొందరిని వాడు ఇన్చార్జిలుగా నియమించామని మీకు ఏ సమస్య వచ్చినా వారికి తెలిపితే సంబంధించిన వారితో చర్చించి పనులు పూర్తి చేస్తారని ఇంజనీర్ రాజేష్ వారిని కౌన్సిలర్లకు పరిచయం చేశాడు. పారిశుద్ధ్యం నీటి సరఫరా, కరెంటు విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యపు పనులపై కౌన్సిలర్లు వారిని నిలదీశారు.

ఏది ఏమైనా సమావేశంలో కౌన్సిలర్లు ఎంత వాదించినా అధికారులు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. చివరగా ఎజెండాలో పెట్టిన అంశాలపై పెద్దగా చర్చ జరగలేదు. పట్టణ విస్తరణకు తగినట్లుగా పారిశుద్ధ సిబ్బందిని కూడా నియమించాలని కౌన్సిలర్లు కమిషనర్ని కోరారు. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు, జవాబు దారి తనం లేనట్లు కొట్టొచ్చినట్లు కనిపించింది.ఇంకా ఎవరికీ అవకాశం ఇవ్వకుండా కమిషనర్ సభను ముగించారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నుకోబడిన కోఆప్షన్ సభ్యులతో పాటు కౌన్సిలర్లు పరిపాలన విభాగపు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బాధితురాలి వయసుపై హైకోర్టు కీలక ప్రశ్నలు.. రేపు మధ్యంతర బెయిల్‌పై తీర్పు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha