Dailyhunt
సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు టిజిసిఎస్బి ఆపరేషన్ క్రాక్డౌన్-2

సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు టిజిసిఎస్బి ఆపరేషన్ క్రాక్డౌన్-2

వార్త 1 week ago

Telangana Cyber Crime: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అడుగులు వేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ క్రాక్డౌన్ 2 పేరుతో భారీ తనిఖీలు చేపట్టింది.

శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ సోదాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత నేరగాళ్ల వివరాలను పోలీసులు సేకరించారు. గత రెండేళ్లలో అరెస్టయిన 614 మంది సైబర్ నేరగాళ్ల ప్రస్తుత పరిస్థితి ఏమిటో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక పోలీసులతో కలిసి సైబర్ నిపుణులు కూడా చురుగ్గా పాల్గొన్నారు.

Read also: Hyderabad crime: డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం.. కంపెనీ మేనేజర్ అరెస్ట్

 Cyber police tracking online crimes

Telangana Cyber Crime: నేరగాళ్ల ప్రస్తుత కదలికలపై పోలీసుల డేగ కన్ను

ఈ తనిఖీల్లో భాగంగా నేరగాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, ఏం పనులు చేస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అరెస్టయిన వారు జైలు నుంచి వచ్చాక తమ పద్ధతి మార్చుకున్నారా లేదా మళ్లీ అవే తప్పులు చేస్తున్నారా అని చెక్ చేశారు. వారి ఆర్థిక వనరులు, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారితో సంబంధాలు ఉన్న ఇతరుల సమాచారం కూడా సేకరించారు. మొత్తం 614 మందిలో 335 మంది వివరాలు మాత్రమే పోలీసులకు చిక్కాయి. వీరంతా తెలంగాణలో వందలాది కేసులు, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించి వారిపై నిఘా పెట్టారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మర వేట

పోలీసులు గుర్తించిన నేరగాళ్లలో సుమారు 115 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. గతంలో సికింద్రాబాద్ హోటల్‌లో పనిచేసిన ప్రసాద్ కుమార్ అనే నిందితుడు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు తేలింది. అరెస్టయిన వారిలో బ్యాంక్ ఖాతాలు ఇచ్చే వారు, ఏజెంట్లు, నకిలీ సిమ్ కార్డులు అమ్మే డీలర్లు ఎక్కువగా ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హిమాయత్ సాగర్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha