Medak Nursing Students Protest: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థినీలు జిల్లా కేంద్రం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నర్సింగ్ కళాశాల నుండి సుమారు రెండు కిలోమీటర్ల మేరా రాందాస్ చౌరస్తా చేరుకొని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ మండుటెండలోఇక్కడ వద్దని ప్రైవేటు బస్సులో కలెక్టరేట్ తీసుకువెళ్లారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ నగేష్ విద్యార్థుల వద్దకు చేరుకుని మీ సమస్యలు జిల్లా ఇంటర్ విద్యార్థి గారికి. ప్రజావాణి హాల్లో విద్యార్థులతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి మాట్లాడారు.
Read Also:Telangana High Court: మద్యం తాగితే వాహనం సీజ్ చేయకూడదు.. పోలీసులకు కీలక ఆదేశాలు!
నర్సింగ్ కళాశాల నుండి ఆటోనగర్ ఆదవశాని మీదుగా రాందాస్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రాసారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ ఐ లక్ష్మణ్ అక్కడికి చేరుకున్నారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. పిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఇక్కడ నిరసన తెలుపడం సరికాదని ప్రైవేటు బస్సు రప్పించి కలెక్టరేట్కు తీసుకెళ్లారు. అక్కడ కలెక్టరేట్లో విద్యార్థులు తమ సమస్యలు కలెక్టర్ ప్రథమ సింగ్ మొరపెట్టుకున్నారు. కలెక్టర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సమాచారం అందుకున్న డిఎస్పి ప్రసన్నకుమార్ అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి తో పాటు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలు జిల్లా ఇంటర్ అధికారి మాధవి దృష్టికి తీసుకెళ్లారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపు: మంత్రి పొన్నం ప్రభాకర్

