Tamil Nadu political: తమిళనాడు రాజకీయ వేదికపై సనాతన ధర్మం అంశం పై మరోసారి దుమారం రేపుతున్నాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, ఇటీవల కొత్తగా ఎన్నికైన తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) పార్టీ ఎమ్మెల్యే వీఎస్ ముస్తఫా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై BJP నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శనివారం సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన ఆమె.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసమే మెజారిటీ హిందువుల నమ్మకాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Foreign Travel Tax: విదేశాలకు వెళ్లే వారికి ఊరట.. కొత్త పన్నులపై కీలక స్పష్టత

Tamil Nadu political: మత వివక్షపై ఖుష్బూ సూటి ప్రశ్నలు
పుట్టుకతో ఒక ముస్లిం అయిన నేను.. ఇస్లాం మతంలో లేదా క్రైస్తవ మతంలో ఉన్న కొన్ని ఆచారాలు అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తే ఈ నేతలు అంగీకరిస్తారా? క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే తమిళనాడు ముఖ్యమంత్రి ఊరుకుంటారా? కేవలం హిందూ మతాన్నే టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా మారిందని మండిపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్ వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. హిందూమతం అంటే అంతగా అలర్జీ ఉంటే.. మొదట ఉదయనిధి స్టాలిన్ తన ఇంట్లోని మహిళలను నియంత్రించాలి. ఆయన తల్లి, అత్తలు, ఆయన మాజీ మంత్రివర్గంలోని మహిళా సహచరులు నుదుటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, నిత్యం హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. వారిని గుడులకు వెళ్లొద్దని, తాము హిందువులం కాదని ప్రకటించుకోమని చెప్పే ధైర్యం ఉదయనిధికి ఉందా?" అని ఖుష్బూ నిలదీశారు.
"కొత్తగా గెలిచిన ఉత్సాహంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్న మీ ఎమ్మెల్యేల నోళ్లకు తాళం వేయాల్సిందిగా సీఎం విజయ్‌ను కోరుతున్నాను. సనాతన ధర్మం, హిందూమతం ఎల్లప్పుడూ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాయి, సమానత్వాన్ని నమ్ముతాయి. పదవిలోకి రాగానే మతపరమైన విభజన తీసుకు రావద్దు. ప్రజలు మీ నుంచి మెరుగైన పరిపాలనను ఆశిస్తున్నారు" అని ఆమె స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ట్రాక్‌పై దూసుకొచ్చిన రైలు..ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలను కాపాడిన వీరమాత!

