Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

వార్త 3 weeks ago

Sigma Movie Release Date: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం 'సిగ్మా' (Sigma) విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన వివరాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. “సిగ్మా జూలై 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ అద్భుతమైన సెల్యులాయిడ్ ప్రయాణాన్ని వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ ఒక క్రేజీ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Read Also: Pooja Hegde Selfie Controversy: సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే

 Sundeep Kishan’s ‘Sigma’ movie release date fixed!

Sigma Movie Release Date: హీరోగా సందీప్ కిషన్.. తమన్ సంగీతం

ఈ సినిమాకు ఉన్న మరో పెద్ద విశేషం ఏమిటంటే.. ఇందులో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మెరవనుంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ సమాచారం.

కేవలం 25 ఏళ్ల వయసున్న జేసన్ సంజయ్.. కెనడా, లండన్‌లలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసిన తర్వాతే దర్శకత్వం వైపు అడుగులు వేశారు. 2023 ఆగస్టులో ప్రకటించిన ఈ సినిమా షూటింగ్‌ను ఆయన పక్కా ప్లానింగ్‌తో కేవలం 65 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. సుభాస్కరన్ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ముఖ్యమంత్రి విజయ్ కుమారుడి తొలి సినిమా కావడం, సందీప్ కిషన్ హీరోగా చేస్తుండటంతో ఈ క్రాస్-వుడ్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

'పెద్ది' టికెట్ ధరల పెంపు పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha