Dailyhunt
సంగారెడ్డి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

వార్త 1 week ago

గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Sangareddy fire accident : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

దట్టమైన పొగతో ఆందోళన

అగ్ని ప్రమాదం కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Read Also:Telangana High Court: మద్యం తాగితే వాహనం సీజ్ చేయకూడదు.. పోలీసులకు కీలక ఆదేశాలు!

 Sangareddy fire accident

ప్రమాదానికి కారణం ఏమిటి?

ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా లేదా ఎవరైనా లోపల చిక్కుకున్నారా అనే విషయంపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

సమస్యలపై గల మెత్తిన నర్సింగ్ కళాశాల విద్యార్థునిలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha