Sangareddy Crime News: సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మూడు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మారణాయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు.
నారాయణఖేడ్‌లో దొంగతనం.. ముఠా గుట్టు రట్టు
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ వివరాలను వెల్లడించారు. గత నెల 11వ తేదీన నాగలిగిద్ద గ్రామానికి చెందిన మాలి బాటిల్ దత్తు అనే వ్యక్తి తన వాహనం నారాయణఖేడ్ పట్టణంలోని మానూర్ ఎక్స్ రోడ్ వద్ద దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ మరియు నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
ముగ్గురు రాష్ట్రాల్లో దొంగతనాలు.. 13 మంది నిందితులు
పోలీసుల లోతైన విచారణలో మహారాష్ట్ర, కర్ణాటక, మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 13 మంది సభ్యులు కలిగిన ఒక భారీ ముఠా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరిలో ఆరుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఏడుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.
Read also: Medak District: మద్యం సేవించి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ఆందోళనలో ప్రయాణికులు
స్వాధీనం చేసుకున్న సొత్తు:
- రూ. 2 లక్షల నగదు
- ఒక పిస్తోల్
- ఒక ఎయిర్ గన్
- 2 కత్తులు
- 6 సెల్ ఫోన్లు
- ఒక టిప్పర్ వాహనం

Sangareddy Crime News: స్క్రాప్ మాఫియా తరహాలో దొంగతనం
ఈ ముఠా పనితీరు అత్యంత పకడ్బందీగా ఉంటుందని ఎస్పీ వివరించారు. ఒక రాష్ట్రంలో దొంగలించిన వాహనాలను మరో రాష్ట్రానికి తరలించి అక్కడ స్క్రాప్ చేస్తుంటారు. వాహనం యొక్క ఇంజన్ మరియు ఛాసిస్ నంబర్లను ఒకరికి, బాడీ పార్ట్స్‌ను మరొకరికి విక్రయిస్తూ పోలీసుల కళ్లు గప్పుతున్నారని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి కూడా పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

