BJP celebrations in Siddipet: సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు అట్టహాసంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పాత బస్టాండ్ వద్ద మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.
Read Also : West Bengal Elections: బ్రేకింగ్: మమతా బెనర్జీ రాజీనామా?
మోదీ పాలనకు నిదర్శనం: బైరి శంకర్ ముదిరాజ్
ఈ సందర్భంగా బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు, ఆయన సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి (పుదుచ్చేరి) రాష్ట్రాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని ఆయన కొనియాడారు. కేరళ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకోవడంతో పాటు సీట్లు గెలవడం శుభపరిణామమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికారం దిశగా అడుగులు
ఈ విజయాలు కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాదని, భయపెట్టే రాజకీయాల నుండి నమ్మకం మరియు అభివృద్ధి వైపు ప్రజలు మలుపు తిరుగుతున్నారనడానికి సంకేతమని శంకర్ ముదిరాజ్ అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచి, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
BJP celebrations in Siddipet: పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ సంబరాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్, నాయకులు గుండ్ల జనార్ధన్, కెమ్మసరం సంతోష్, చెంది సత్యనారాయణ, తాటికొండ శ్రీనివాస్, గందె సంతోష్, పవన్, మహేందర్, గణేష్, కరుణాకర్, యాదగిరి, వెంకట్రావు, ప్రసాద్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ జై బోలో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
విజయ్ ప్రభంజనం.. విక్రమ్, శివకార్తికేయన్ సహా సినీ ప్రముఖుల అభినందనలు

