Choutakur Bonalu: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ దేవత బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన ఎత్తుకొని ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కట్టమైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
Read Also:Vijayawada durga gudi: దుర్గమ్మ భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Choutakur Bonalu: ఆషాఢ మాసంలో కట్టమైసమ్మ దేవతను కొలవడం ఆనవాయితీగా వస్తోందని, ప్రతి ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రజక సంఘం సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగమయ్య తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు భక్తి పాటలు పాడుతూ, ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చౌటకూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ్య, సంఘం నాయకులు జోగయ్య, బాబు, వెంకటేశం, నర్సింలు, సోమయ్యతో పాటు రజక సంఘం మహిళలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com
ఈ నెల 13 నుండి శ్రావణమాసం స్టార్ట్.. ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు

