Dailyhunt
సంజూ శాంసన్ ఫామ్‌పై స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ.. విమర్శలకు చెక్!

సంజూ శాంసన్ ఫామ్‌పై స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ.. విమర్శలకు చెక్!

వార్త 1 week ago

Stephen Fleming on Sanju Samson Form: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్ ఫామ్ గురించి వస్తున్న విమర్శలపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గట్టి సమాధానమిచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ నుండి భారీ అంచనాల మధ్య సిఎస్‌కేలోకి వచ్చిన శాంసన్, మొదటి రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితం కావడంతో చర్చ మొదలైంది.

Read Also:Shreyas Iyer Fined IPL 2026: చెన్నైపై గెలిచినా పంజాబ్‌కు తప్పని శిక్ష

ఫ్లెమింగ్ ఏమన్నారంటే?

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంజూ ఫామ్ గురించి అడిగిన ప్రశ్నకు ఫ్లెమింగ్ ఘాటుగా స్పందించారు.సంజూ ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు, ప్రాక్టీస్ సెషన్లలో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కేవలం రెండు ఇన్నింగ్స్‌లు ఒక ఆటగాడి భవిష్యత్తును లేదా ఫామ్‌ను డిసైడ్ చేయవు” అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.శాంసన్ ఒకసారి కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాడని, అతనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని కోచ్ స్పష్టం చేశారు.

Stephen Fleming on Sanju Samson Form: సంజూ శాంసన్ – ఇప్పటివరకు ప్రయాణం

2026 టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శాంసన్, ఐపీఎల్ 2026ని మాత్రం నెమ్మదిగా మొదలుపెట్టారు. తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 6 పరుగులు (7 బంతుల్లో) చేసి అవుటయ్యారు.చెపాక్ స్టేడియంలో జరిగిన హోమ్ మ్యాచ్‌లో 7 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేశారు.

 Stephen Fleming defends Sanju Samson

    చెపాక్ శాపం?

    క్రికవిజ్ (CricViz) గణాంకాల ప్రకారం, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో సంజూ రికార్డు ఆశాజనకంగా లేదు. ఇక్కడ ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 11 సగటుతో 66 పరుగులు మాత్రమే చేశారు.100 వద్ద ఉంది, ఇది ఇతర స్టేడియాలతో పోలిస్తే సంజూకు అత్యల్పం.

    సిఎస్‌కేకు క్లిష్ట సమయం

    గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఐదుసార్లు ఛాంపియన్ సిఎస్‌కే, ఈ సీజన్‌లో కూడా వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి ఖాతా తెరవాలని జట్టు ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ భారీ స్కోరు సాధించి విమర్శల నోళ్లు మూయించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also:

    గుజరాత్ కోచ్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha