Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరదాగా ఈత కోసం వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి

సరదాగా ఈత కోసం వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి

వార్త 3 months ago

Narsapur incident: సరదాగా ఈత కోసం వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి… మృత్యువులోనూ వీడని స్నేహబంధం…… నాచారం చెక్ డాం హల్ది వాగులో ఘటన……… నర్సాపూర్ మే 7 ప్రభాతవార్త……….

నర్సాపూర్ న కు చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి పెళ్లికి వెళ్లి వస్తు సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి చెందిన సంఘటన నాచారం చెక్ డాం వద్ద హల్ది వాగు లో చోటు చేసుకుంది.

Read also: Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య?

 Narsapur incident: Three friends died while going for a fun swim

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే……. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు నాచారంలో చెక్ డ్యామ్ లో ఈత కోసం వెళ్లి మృతి చెందారు. ఈ మేరకు నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రశాంత్ యాదవ్ (27,) వికాస్ (27,) ఆనంద్ రెడ్డి (27 )లు కలిసి తూప్రాన్ లో జరిగే పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. పెళ్లి అనంతరం తిరిగి వస్తూ సరదాగా ఈత కోసం నాచారం చెక్ డ్యామ్ లోకి దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తున నీటిలో మునిగిపోయి గల్లంతై మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి గాలించి ముగ్గురి మృతి దేహాలను వెలికి తీశారు. ముగ్గురు స్నేహితులు ఒకే వయసు వారు కావడం ఒకేసారి ముగ్గురు స్నేహితులు మృత్యువులోని వీడని స్నేహబంధం అంటూ నర్సాపూర్ లో పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు ఈత కోసం నీటిలో మునిగి మృతి చెందడం పట్ల నర్సాపూర్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎమ్మెల్సీ అనంత బాబు సెంట్రల్ జైలుకు తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha