Collector Prabhakar Reddy | వీరఘట్టం, జూన్ 18, ప్రభాతవార్త: ఆయన జిల్లాకు కలెక్టర్.. అంతే కాదు జిల్లా మేజిస్ట్రేట్ కూడా. అంతటి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకున్న నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తూ తన కుమారుడిని సర్కార్ బడిలో చేర్పించి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.
ఎన్. ప్రభాకరరెడ్డి ఆదర్శంగా నిలిచారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న తరుణంలో, ఉన్నతాధికారులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం విశేషంగా మారింది. కలెక్టర్ తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని పార్వతీపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు.
Read Also : సాయికృష్ణను హత్య చేసి..కృష్ణానదిలో అస్థికలు కలిపేశారు:కేశినేని నాని
మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి ప్రవేశం
కలెక్టర్ కుమారుడు క్రిష్ ధరణ్ రెడ్డి గతంలో విజయవాడలోని పడమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయనను పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతిలో చేర్పించారు.
జిల్లా మేజిస్ట్రేట్ స్థాయి అధికారి తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.
Collector Prabhakar Reddy: ఇదే పాఠశాలకు మరో గౌరవం
ఈ పాఠశాలకు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని ఇదే పాఠశాలలో చదివించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని చాటుకున్నారు.
Collector Prabhakar Reddy son
ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అదే మార్గంలో నడవడంతో స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విద్యకు కొత్త ఊపు
కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచడమే కాకుండా, విద్యా రంగంలో సానుకూల మార్పులకు నాంది పలికిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా, కలెక్టర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

