Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సతీ లీలావతి' మూవీ రివ్యూ

'సతీ లీలావతి' మూవీ రివ్యూ

వార్త 4 days ago

Sathi Leelavathi movie: లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 'శాకుంతలం' ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటించాడు.

ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం, నెల తిరక్కుండానే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చేసింది. ఈ రోజు మే 20వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Jio Hotstar లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : Inder Kaur Murder Case:పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్య.. అసలేం జరిగింది?

 Sathi Leelavathi movie review

కథ

లీలావతి (లావణ్య త్రిపాఠి) టాలీవుడ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ సినిమా డైరెక్టర్. ఆమెతో సినిమాలు తీయడానికి ఎంతో మంది నిర్మాతలు క్యూ కడుతుంటారు. లీలావతి భర్త సేతుపతి (దేవ్ మోహన్) ఒక సైకాలజిస్ట్. లీలావతికి చిన్నతనం నుంచే తన తల్లిదండ్రుల (నరేశ్ – పవిత్ర) నిరంతర పోట్లాటలను చూసి పెరగడం వల్ల ఒక రకమైన మానసిక సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుండి బయటపడటానికి సాయం చేసిన సైకాలజిస్ట్ సేతుపతినే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే, పెళ్లయ్యాక లీలావతి పూర్తిగా తన కెరియర్‌పైనే శ్రద్ధ పెట్టడంతో భర్తను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది.

ఈ క్రమంలో భార్య ప్రవర్తనతో విసిగిపోయిన సేతుపతి, తాను నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) అనే మరో యువతిని ప్రేమించానని, ఇకపై ఆమెతోనే జీవిస్తానని లీలావతికి బాంబు పేలుస్తాడు. విడాకులు ఇవ్వాలంటూ లాయర్‌ను కూడా ఇంటికి పిలిపించి సంతకం పెట్టమంటాడు. అయితే, సేతుపతి తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, కేవలం తన తండ్రి బలవంతం మీదే చేసుకున్నాడనే నిజం లీలావతికి అప్పుడే తెలుస్తుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన లీలావతి తన భర్తను ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత లీలావతి తండ్రి, ఆమెతో సినిమా తీయాలనుకునే మొట్ట రాజన్, లాయర్, సేతుపతి ప్రియురాలు నికోలా అంతా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు లీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ.

పనితీరు:

కథాకథనాలు మాత్రమే కాదు, సినిమాలో వచ్చే సన్నివేశాలు, సంభాషణలు (డైలాగ్స్) కూడా చాలా పేలవంగా ఉన్నాయి. విషయం లేని కథను నవ్వించడానికి నటీనటులు ఎంత కష్టపడ్డారో, థియేటర్లలోనూ, ఇప్పుడు ఓటీటీలోనూ నవ్వు రాక ప్రేక్షకులు కూడా అంతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం (BGMM), ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలు కేవలం యావరేజ్ అనిపిస్తాయి. బలహీనమైన కథను ఎంత లాగినా ప్రయోజనం ఉండదని ఈ సినిమా మరోసారి నిరూపించింది. లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ చిత్రం ఓటీటీలో సైతం ప్రేక్షకులకు ఒక పెద్ద సహన పరీక్షగా మిగిలిపోతుంది.

ముగింపు

చివర్లో క్లైమాక్స్ కోసం కొండపై ఒక పెద్ద సెటప్ వేసి, అక్కడ పాత్రల మధ్య ఛేజింగ్ సీన్లు పెట్టారు. ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఏదో కార్టూన్ షో, వీడియో గేమ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్‌ను చిన్నప్పటి నుంచి లవ్ చేసే మరుగుజ్జు క్యారెక్టర్ వాష్ రూమ్ హడావిడి, హీరోయిన్ చెప్పే ఐస్‌క్రీమ్ – గులాబీ జామ్ కథలు, ‘స్వాతిముత్యం’ కమల్ హాసన్ కంటే అమాయకంగా చూపించిన సైకాలజిస్ట్ క్యారెక్టర్ ఆడియన్స్ సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'హ్యాపీ బర్త్ డే తారక్'.. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha