Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సత్యదేవ్ 'రావు బహదూర్' రిలీజ్ డేట్ మార్పు

సత్యదేవ్ 'రావు బహదూర్' రిలీజ్ డేట్ మార్పు

వార్త 2 weeks ago

Rao Bahadur Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వైవిధ్యమైన సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రావు బహదూర్'.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read Also:Rowdy Janardhana: విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్: 'రౌడీ జనార్ధన' పోస్టర్ అదిరిపోయింది

విడుదల తేదీ మార్పు: జూలై 3న థియేటర్లలోకి..

ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 5వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే, సాంకేతిక పనులు, ప్రమోషన్స్ కోసం తగిన సమయం కేటాయించే క్రమంలో విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. “కొత్త తేదీ.. ఒక మరువలేని అనుభవం” అంటూ ప్రచారాన్ని వేగవంతం చేశారు.

 Rao Bahadur Movie Release Date

Rao Bahadur Movie: సత్యదేవ్ రాయల్ లుక్.. పోస్టర్స్ వైరల్!

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ విడుదల చేసిన నాలుగు కొత్త పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “అనుమానం పెనుభూతం” అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పోస్టర్లలో సత్యదేవ్ వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఒంటి నిండా ముత్యాల అలంకరణలతో ఆయన ఉన్న రాయల్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

"నచ్చినట్లు బతకాలి.. మనల్ని మనం గౌరవించుకోవాలి!"

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha