Nagpur Crime: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల వ్యక్తి, 2024లో తనకంటే వయసులో చిన్నదైన 26 ఏళ్ల మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
అయితే, ఈ పెళ్లిని మొదటి భార్య కుమారుడైన అక్షత్ శ్రీవాస్తవ (21) తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి.
Read Also: Mancherial Crime News: చిన్న కారణంతో నిండు ప్రాణం బలి!
అమానుష ఘటన – బాధితురాలి ఫిర్యాదు
సవతి తల్లిపై కక్ష పెంచుకున్న అక్షత్, ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం. ఏప్రిల్ 10న అక్షత్ తన సవతి తల్లి గదిలోకి ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు.ఈ దారుణం కారణంగా బాధితురాలు గర్భం దాల్చింది.
Nagpur Crime News
Nagpur Crime: పరువు కోసం భర్త ఒత్తిడి
తాను గర్భవతినని తెలిసిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు వివరించింది. అయితే, కొడుకు చదువు, భవిష్యత్తు పాడవుతుందని, కుటుంబ పరువు పోతుందనే కారణంతో ఈ విషయాన్ని బయట పెట్టవద్దని భర్త ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. న్యాయం జరగదని గ్రహించిన బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్షత్ శ్రీవాస్తవను అరెస్టు చేశారు. కన్నతండ్రి భార్య అని కూడా చూడకుండా యువకుడు ఇలాంటి నీచానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

