IPhone 18 Pro Max: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి తరం ఐఫోన్ల ఆవిష్కరణకు యాపిల్ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను పరిచయం చేసేందుకు ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది.
సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది.
ఈవెంట్ పసిఫిక్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ మ్యాక్‌రూమర్స్ నివేదిక ప్రకారం, ఈవెంట్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 18 నుంచి ప్రో మోడళ్ల విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Read Also : Reliance Ice cream : ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్..'బాంబే క్రీమరీ' క్రీమ్ బ్రాండ్
Apple iPhone 18 Pro series launch on September 9!
iPhone 18 Pro Max: 2nm ప్రాసెసింగ్‌తో ఏ20 ప్రో చిప్
ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో అత్యంత శక్తిమంతమైన ఏ20 ప్రో (A20 Pro) చిప్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 2 నానోమీటర్ (2nm) ప్రక్రియతో తయారయ్యే ఈ చిప్ వల్ల ఫోన్ ప్రాసెసింగ్ వేగం గణనీయంగా పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా మెరుగుపడనుంది. ప్రో మ్యాక్స్ వెర్షన్‌లో మరింత పెద్ద బ్యాటరీని అందించవచ్చని అంచనా.
వేరియబుల్ అపెర్చర్‌తో 48MP ట్రిపుల్ కెమెరా
ఈ సిరీస్‌లో కెమెరా వ్యవస్థ ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. 48 మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు మొదటిసారిగా ‘వేరియబుల్ అపెర్చర్’ టెక్నాలజీని పరిచయం చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివిధ వెలుతురు పరిస్థితుల్లోనూ అద్భుతమైన క్వాలిటీతో ఫొటోలు తీయవచ్చు.
మ్యాక్‌వరల్డ్ సమాచారం ప్రకారం ఈ కొత్త ఐఫోన్లు డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, డార్క్ గ్రే, సిల్వర్ రంగుల్లో లభించనున్నాయి. భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ.1,39,900 వరకు ఉండవచ్చని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే ధర, ఫీచర్ల అధికారిక వివరాలను యాపిల్ సెప్టెంబర్ 9న వెల్లడించనుంది.

