Hyderabad Crime: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం హైదరాబాద్‌లో కలకలం రేపింది.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేసి నగదును బదిలీ చేసినట్లు, అదే కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Read Also :Hyderabad: హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. హైదరాబాద్‌లో ఫెర్టిలిటీ రాకెట్ గుట్టురట్టు
సీజ్ చేసిన ఫోన్ నుంచి రూ.1.70 లక్షల బదిలీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఫోన్‌లోని ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించి సుమారు రూ.1.70 లక్షలను తన బంధువుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
12 తులాల బంగారం కూడా తాకట్టు?
అదే కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను కూడా కానిస్టేబుల్ తాకట్టు పెట్టినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీజ్ చేసిన వస్తువుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో మీర్‌పేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
Hyderabad Crime: న్యాయస్థానం రిమాండ్
ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. పోలీసుల స్వాధీనంలో ఉన్న సాక్ష్యాధారాలనే దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

