Dailyhunt
శాంతియుత పరిష్కారమే ఉత్తమమైన మార్గం

శాంతియుత పరిష్కారమే ఉత్తమమైన మార్గం

వార్త 5 days ago

Iran israel war : ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు స్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులను ముమ్మరం చేస్తున్నాయి. దీనితో దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తతలను కలుగచేస్తుంది.

ప్రతి చర్యగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన ముఖ్యమైన స్థావరాలతోపాటు ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసు కొని సృష్టిస్తున్న యుద్ధ వాతావరణంతో దేశాల మధ్య ఘర్షణ మరింతగా పెరుగుతుంది. అయితే క్షేత్రస్థాయిలో సామాన్య జనాల కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎప్పు డు ఎటువైపు నుండి ఎలాంటి మారణాయుధాలు ముకు మ్మడిగా వచ్చిపడుతాయేమో అనే సందిగ్ధంలో యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాత్రిపగలు గడుపుతున్న పరిస్థితులు గోచరిస్తూనే ఉన్నాయి. యుద్ధంలో దేశాల్లోని వాణిజ్యపరమైన ముఖ్య సైనిక స్థావరాలను లక్ష్యంగాచేసుకొని సంధిస్తున్న అత్యాధు నిక డ్రోన్లు, క్షిపణులు లాంటి మారణాయుధాలు తరచుగా జనావాసాల మీదికి వస్తూ అభంశుభం తెలియని ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి.

Read Also: Strait of Hormuz: హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ: రంగంలోకి ఐరోపా దేశాలు

 iran israel war

iran israel war : గందరగోళాన్ని సృష్టించే అవకాశం

ఈ క్రమంలో దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇరు దేశాల్లో ఉన్న సామాన్య జనాలకు శాపంగా మారుతున్నాయి. యుద్ధాలు ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ భౌగోళిక వనరులపై ప్రభావితం చూపిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, ప్రాణ నష్టంతో పాటు ఆయుధాల విస్పో టనంతో వెలువడే విషపూరిత రసాయనాలు గాలిలో కలిసి వాతావరణం కాలుష్యం లాంటి అనేకనష్టాలను చవిచూసే అవకాశం లేకపోలేదు. నేటి ఆధునిక మానవుడు ఇంకా యుద్ధ తంత్రంలో మునిగి తేలుతున్న తరుణంలో దేశాల మధ్య ఏమైనా విభేదాలు సమస్యలున్నా పరస్పరం చర్చల ద్వారా దేశాల మధ్య ఉండే అపోహలను ఉద్రిక్తతలను నివారించే దిశగా శాంతియుత మార్గం ద్వారా పరిష్కరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధాల వలనచాలా వరకు ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ యుద్ధాల వలన ప్రజలలో లేనిపోని అపోహలు గందరగోళాన్ని సృష్టించే అవ కాశం లేకపోలేదు. అగ్రరాజ్యంలోని ప్రజలు అయినా ఆర్థి కంగా వెనుకబడిన దేశాల ప్రజలు అయినా ఎక్కువ శాతం మాత్రం యుద్ధ కాంక్షను ఏ మాత్రం కావాలని కోరుకోరు. పైగా శాంతి కాముకులుగా జీవించాలని అనుకుంటారు. దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుకొని భవిష్యత్తులో జరగ బోయేపరిణామాలకు ఊహాత్మక భావనలకు యుద్ధమే పరిష్కారం అనుకుంటే నేటి ఆధునిక యుగంలో యుద్ధ కాంక్ష ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా తలె త్తుకు మానవు కారణాలేవైనా హింసా మార్గంలో సమ స్యకు పరిష్కారం అన్వేషించి సరైన విధానంలో సమస్యను పరిష్కరించుకునే రీతి నేటి ఆధునిక మేధాశక్తికి అవసరం కావచ్చు.

శాశ్వతంగా సవరించుకునే ప్రయత్నం

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల వలన దేశాల నడుమ వాణిజ్య వ్యాపార సంబంధాలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా అవసరాలకు ఉపయోగపడే పెట్రో లియం ముడిసరుకు రవాణా చేసే నౌకలు యుద్ధంలో లక్ష్యం కావడం ఆయుధాలు సృష్టించే విధ్వంసం దాటికి వనరులు దెబ్బతినడం విలువైన కట్టడాలు కళ్ళముందే కుప్పకూలిపోతుండడం మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉండడం యుద్ధం చేస్తున్నది ఎవరికోసం దేనికోసం వచ్చే-ఫలితం ఏముంది అని చర్చించుకునే లోపే జరగబోయే నష్టం తీవ్రంగా ఉంటుంది. దేశాల మధ్య సమస్యలు ఉంటే వాటిని శాశ్వతంగా సవరించుకునే ప్రయత్నం చేస్తేతప్ప మరొ కటిలేదేమో. యుద్ధాలు ప్రపంచంలోని మానవాళిపై తీవ్ర మైన ప్రభావం చూపెడుతూ ప్రపంచ ఆర్థిక స్థితిగతులనే మార్చివేసే విధంగా యుద్ధ వ్యూహాలు కొనసాగుతూ ఉండ డం విస్మయానికి గురి చేస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధాలు యుద్ధాల్లో విధ్వంసాలకు ఉపయోగిస్తున్న తీరు మానవ జీవన విధానాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని కలుగ చేస్తుండడం శోచనీయం.

 iran israel war

వ్యూహ ప్రతి వ్యూహాలతో

దేశాల మధ్య ఆధిపత్య యుద్ధాల వల్ల సామాజిక అభివృద్ధి ఆర్థికవ్యవస్థలు కోలుకో లేని నష్టాల నడుమ ముందుతరాల వరకు కూడా సరిచేసు కోలేని స్థితిలో దేశాల పరిస్థితి నలిగిపోతుండటం, హింసాత్మ క ఆలోచనలతో ఉన్నటువంటి దేశాలు అంతగా సాధించేది ఏమీ లేకపోగా యుద్ధాల వలన ఆర్థిక సామాజిక అభివృద్ధికి వెనుకబడిపోతున్నాయి. కారణాలేవైనా పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత ఉధృతంగా మారు తూ ఆందోళన కలిగించేదిగా చేస్తుంది. యుద్ధం తీవ్రత పెర గడంతో ఇరాన్ కూడా వెనుకకు తగ్గేది లేదంటూనే వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతుండటంతో దేశాల్లో తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా అహింసా, సమైక్యవాదం దేశాల నడుమ సుస్థిరత ప్రపంచంలో యుద్ధ నియంత్రణతోపాటు సకల సమస్యలకు శాంతియుత పరిషా్కరమే ఉత్తమమైన మార్గంగా అగ్రరాజ్యా లతోసహా యుద్ధ సన్నద్ధత కలిగినదేశాలు పరస్పరం శాంతి చర్చలతో ఉద్రిక్తతలను నిలువరించుకోవాలి.

-దాడిశెట్టి శ్యామ్ కుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ - అమెరికా తదుపరి అడుగు ఎటువైపు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha