Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రికల్ ద్వి చక్ర వాహనం దగ్ధం

షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రికల్ ద్వి చక్ర వాహనం దగ్ధం

వార్త 3 weeks ago

Electric Scooter Fire Accident: ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ స్కూటర్ దగ్ధం కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగని సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

Read Also: Hyderabad Metro: ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను కొనుగోలు చేసిన రేవంత్ సర్కార్

Electric Scooter Fire Accident: ఛార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు

బాధితుల కథనం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఎలక్ట్రికల్ స్కూటర్కు చార్జింగ్ పెట్టి ఉండగా అకస్మాత్తుగా మంటలు చెల్లరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు గ్రామంలో వివాహ సంబరాల్లో హాజరు కావడానికి కుటుంబీకులు వెళ్లిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ వాహనం ప్రతి సంవత్సరం సర్వీసింగ్ చేయించాల్సిందిగా ఉండగా పనుల భారంతో ఈ ఏడాది ఎలక్ట్రికల్ స్కూటర్ సర్వీసింగ్ చేయించలేదని బాధితులు తెలిపారు వాహనం కంపెనీ తయారీ ఎవరో తెలియదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha